పవిత్ర ఖురాన్ గ్రంథములోని ధర్మములను సంరక్షించుట మరియు ప్రచారము చేయుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని దైవజ్ఞానమునకు భంగం కలుగకుండా హిందూ, క్రైస్తవములతో సమన్వయపరచుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని హజ్రత్ మహమ్మద్ ప్రవక్త (సం) గారి గౌరవమునకు లోటు లేకుండా చూచుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని వాక్యములను దేవుని విధానంలోని భావమును విశధీకరించి చెప్పుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని పవిత్రతను ఇస్లాంలో మరి ఏ గ్రంథములతో సరిపోల్చకుండా చూచుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని ప్రవక్తకుగాని, అల్లాహ్ కుగాని ఆటంకమును కలుగజేయు అర్థము కాని వాక్యములకు ఎవరూ ఎదురాడని వివరమును తెలుపుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని దైవవాక్యముల తర్వాతనే ముస్లీంలకు హదీసు గ్రంథములోని వాక్యముల ప్రాధాన్యతయని తెలుపుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని ధర్మము దైవముది, జ్ఞానము ప్రవక్తది, ఆచరణ మనుషులది. అందువలన ఇస్లాం మానవులందరికీ ఆచరణ యోగ్యమైనదని తెలుపుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని ధర్మములు ప్రతి మనిషికీ సంబంధించినవనీ, హదీసు గ్రంథములోని వాక్యములు ముస్లీంలకు మాత్రమే సంబంధించినవని తెల్పుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని దైవధర్మములను ముస్లీంలు మొదట తెలియవలెననీ, తర్వాత హదీసు సాంప్రదాయములను తెలియవలెననీ తెల్పుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని దైవదూత యొక్క వాణిని ప్రవక్త శ్రీ మహమ్మద్ గారు (సం) తెలియజేసినదనీ, ప్రవక్త పరమపదించిన తర్వాత 121, 145, 149, 168 సంవత్సరములకు వచ్చిన హదీసు గ్రంథములు ముస్లీం పండితులు తెలియజేసినవనీ, అందువలన ఇస్లాంలో మొదటి స్థానము పవిత్ర ఖురాన్ గ్రంథముదని తెల్పుట.
పవిత్ర ఖురాన్ గ్రంథములోని దైవధర్మములను తెలిస్తే శాశ్వితమైన పరలోకమునకూ, హదీసు గ్రంథములోని సాంప్రదాయములను తెలిస్తే స్వర్గలోకమునకూ పొవుదురని తెల్పుట.